Hyderabad: రూ.36 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నగర శివారులోని దుండిగల్‌లో ఏటీఏం కేంద్రాలకు డబ్బు తీసుకువెళ్లే వ్యాన్ డ్రైవర్ రూ.36 లక్షలతో పరారయ్యాడు. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే యువకుడు డ్రైవర్‌గా చేరాడు. శనివారం మధ్యాహ్నం రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్‌లతో కలిసి సాగర్ రైటర్స్ సంస్థ కార్యాలయం నుంచి బయలుదేరి జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.13 లక్షల నగదు జమ చేశారు.
అనంతరం జీడిమెట్ల నుంచి నేరుగా దుండిగల్ సాయిబాబా నగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లారు. కస్టోడియన్‌లు వాహనంలోని రూ.15 లక్షలు తీసుకుని ఏటీఎంలోకి వెళ్లారు. డ్రైవర్ సాగర్ మాత్రం వాహనంలోనే ఉండి యూటర్న్ తీసుకుని వస్తానని గన్‌మెన్‌కు చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపటికీ సాగర్ తిరిగి రాలేదు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి కస్టోడియన్‌లు, గన్‌మెన్ కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.36 లక్షల నగదు బ్యాగుతో డ్రైవర్ సాగర్ పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నర్సాపూర్ రోడ్డులో పోలీసులు ఏటీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
- CM Revanth Reddy : సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను కూడా తీసుకురండి
- CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
తాజావార్తలు
-
BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS
-
Railway Engineer: విజయవాడలో సీబీఐ మెరుపు దాడి.. రైల్వే ఇంజినీర్ అరెస్ట్..
-
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
-
Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?