NTV Telugu Site icon

Hackers: పోలీస్‌ స్టేషన్‌ ఫేస్‌ బుక్‌ హ్యాక్‌.. అశ్లీల వీడియో అప్‌లోడ్‌..!

Facebook Hake

Facebook Hake

Hackers: సైబర్ మోసాలు ప్రపంచానికి అతిపెద్ద సవాలు. ఒక్క చోటే కాదు.. అన్ని చోట్లా ఈ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు, సంస్థల సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక తాజాగా హ్యాకర్లు పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ పేజీనే హ్యాక్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన హ్యాకర్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ అధికారిక పేజీకి వీడియోను ట్యాగ్ చేశాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు విషయాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నిర్వహణపై పౌరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read also: Mouth wash: మౌత్ వాష్ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలేంటో తెలుసా..?

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి అక్కడ అసభ్యకర వీడియోలను అప్‌లోడ్ చేశారు. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేయబడినట్లు కనిపిస్తోంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. సైబర్ నేరగాళ్లు ఈ పేజీని హ్యాక్ చేసి.. అందులో న్యూడ్ వీడియోలను అప్‌లోడ్ చేశారు. కొందరు విదేశీ మహిళలు ఈ పేజీలో అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆసిఫ్ నగర్ పోలీసులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా ఫేస్ బుక్ పేజీలో వీడియోలు డిలీట్ కాకపోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారు? హ్యాకింగ్ ఎవరు చేయాలనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 8 అర్ధరాత్రి దాటిన తర్వాత ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.కానీ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఫేస్‌బుక్ పేజీ కొన్ని రోజులుగా యాక్టివ్‌గా లేదు. ఈ పేజీ నుండి చివరి పోస్ట్ డిసెంబర్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీ ఇటీవల యాక్టివ్‌గా లేదు. ఈ పేజీ నుండి చివరి పోస్ట్ డిసెంబర్‌లో ఉంది. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేయబడినట్లు కనిపిస్తోంది.
Taiwan: తైవాన్ లోకి 37 చైనా యుద్ధ విమానాలు