Site icon NTV Telugu

Asaduddin owaisi: బీఆర్ఎస్‌తో పొత్తుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin owaisi: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎంఐఎం పొత్తు గురించి ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు. కేసీఆర్ మంచి పాలన అందిస్తున్నారంటూ కితాబిచ్చారు. 17వ తేదీ మీటింగ్ కు ఆహ్వానం అందలేదని.. ఇంతర పార్టీల మీటింగులకు మేం ఎందుకు వెళ్తాం అని అన్నారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అని కాంగ్రెస్ మమ్మల్ని విమర్శిస్తోందని.. బీజేపీని ఓడించాలని మేం కోరుతున్నామని అసద్ అన్నారు. కొత్త సెక్రటేరియట్ తాజ్ మహల్ ను మించి ఉందని పొగిడారు. మసీద్ నిర్మాణం గురించి అడుగుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ తో పొత్తుపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Read Also: MLC Election: బీఆర్ఎస్‌తో ఎంఐఎం వరస చర్చలు.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై నజర్

ఇదిలా ఉంటే ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన తర్వాత ఎంఐఎం పార్టీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ కీలకవ్యాఖ్యలు చేశారు. 7 స్థానాలు ఉన్న పార్టీ అని కేటీఆర్ అన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ వచ్చే అసెంబ్లీలో 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉంటారని అక్బరుద్దీన్ బదులిచ్చారు. ముస్లింలతో పాటు ఎస్సీ-ఎస్టీ ఓట్లు సంఘటితం అయితే గెలుపు ఈజీ అవుతుందని ఎంఐఎం భావిస్తోంది.

Exit mobile version