NTV Telugu Site icon

Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు బయలుదేరిన అర్జున్ ముండా, బండి సంజయ్..

Arjun Munda, Bandi Sanjay

Arjun Munda, Bandi Sanjay

Keslapur Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర నిన్న అర్థరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నాగోబా జాతరకు వెళ్లేందుకు హైదరాబాద్‌ కు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్ లో నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బయలుదేరారు. కేస్లాపూర్ చేరుకుని గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు నేతలు. నాలుగు గంటలపాటు గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం స్థానిక ఫంక్షన్ హాలులో పాల్గొని అర్జున్ ముండా, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న నేతలు.

Read also: Unstoppable: బాలయ్యతో మెగా మామ-అల్లుడు

గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు. గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నేడు రాత్రి 10 గంటలకు నాగోబాకు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ఆర్.ఎం. జానీరెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందుకులు కలగకుండా.. నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ప్రకటించారు.
Che Guevara: హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనవరాలు.. క్యూబా సంఘీభావ సభలో..