Seniors Attacked Junior Student In IBS College: ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరిన ఘటనలో మరో అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కడి బయటపడుతున్నాయి. బాధిత విద్యార్థి ఒక వర్గంకు సంబందించి కించపరిచే విధంగా మెసేజ్ చేయడంతో గొడవ మొదలైందని సమాచారం. ఆ మెసేజ్ కి సంబదించిన స్క్రీన్ షాట్ లు ఇప్పడు వైరల్ గా మారాయి. 10 మంది సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు మద్య గొడవ ప్రారంభమైంది. ఇప్పటికే ఈఘటనకు సంబంధించిన 5 గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు.. మరో 5 గురి కోసం గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ అనే విద్యార్థులు పోలీసుల అదుపులో ఉన్నారు. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యాన్ని గుర్తించారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌లో బుక్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.
Read also: Narayana: మోడీ వచ్చారు.. వెళ్ళారు.. తెలుగు రాష్ట్రాలకేం చేశారు?
ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరారు. ఒక జూనియర్‌ని ఆట పట్టించాలనుకొని, అతనిపై దాడికి దిగారు. రూమ్‌లోకి తీసుకెళ్లి, ముఖంపై పౌడర్ చల్లి.. విచక్షణారహితంగా కొట్టారు. తమకు ఎదురు చెప్పాడని.. కోపంతో ఆ సీనియర్లు రెచ్చిపోయారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ విద్యార్థి తల్లిదండ్రులు.. వెంటనే క్యాంపస్‌కు చేరుకొని, తమ పిల్లాడిని తీసుకెళ్లారు. దాడి చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇంత దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడుతుంటే.. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ విద్యార్థిపై దాడి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు ట్విటర్‌లో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి.. ఆ సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తనకు ఫిర్యాదు అందడంతో.. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. IBS కాలేజీలో ఎప్పట్నుంచో ర్యాగింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి.
Buddha Venkanna: జగన్ మౌనం వెనుక ఏం జరిగింది?