Site icon NTV Telugu

Hyderabad: మరో దారుణం… పబ్‌లో బర్త్‌ డే పార్టీ.. యువతిపై అఘాయిత్యం..!

Incident

Incident

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జూబ్లీ హిల్స్‌ పబ్‌ కేసు మరువక ముందే.. హైదరాబాద్‌లో అదే తరహా కేసు ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది… హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుజరాత్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్నప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: US Shooting: అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

ఈ నెల 13న జూబ్లీహిల్స్ లోని రిపీట్ పబ్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకువెళ్లింది ఓ యువతి.. ఆ తర్వాత సన్నిహితంగా వున్న ముగ్గురు ఫ్రెండ్స్ తో ఇంటికి చేరుకుంది.. అర్ధరాత్రి కావడంతో యువతితో మాట్లాడుతూ గడిపారు ముగ్గురు యువకులు… అయితే, తెల్లవారుజామున 4 గంటల సమయంలో అందులో ఇద్దరు యువకులు యువతి ఇంటి నుంచి వెళ్లిపోగా.. అప్పటికే యువతిపై కన్నేసిన మరో యువకుడు మాత్రం.. వెళ్లినట్టు నటించి ఇంట్లోనే ఉండిపోయాడు.. ఇక, యువతి గాడ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు.. నిద్రనుంచి తేరుకుని తనపై జరిగిన అఘాయిత్యాన్ని గమనించిన యువతి.. నిందితుడి నుంచి తప్పించుకుని బాత్‌రూమ్‌లో దాక్కుంది.. చుట్టుపక్కల వాళ్లకు ఫోన్‌ చేసి సహాయం కోరుతూ అప్రమత్తం చేసింది.. పరిస్థితిని పసిగట్టిన నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఇక, స్థానికుల సహాయంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.. అమ్నెషియా పబ్‌ ఘటన మరువక ముందే.. జాబ్లీ హిల్స్‌లోని రిపీట్‌ పబ్‌ బర్త్‌ డే పార్టీ.. ఆ తర్వాత యువతిపై అత్యాచారం కలకలం రేపుతోంది.

Exit mobile version