Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్.. భూకబ్జా కేసు నమోదు..
- మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
- భూకబ్జా కేసు నమోదు చేసిన పేట్బషీరాబాద్ పోలీసులు
- మల్లారెడ్డితో పాటు రాజశేఖర్రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు
- పేట్బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు
- సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మల్లారెడ్డిపై పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లార్ రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం ఏడు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. పేట్ బషీర్ బాద్ లో 32 గుంటల భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లు శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా మల్లార్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సుచిత్రలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ కేసులో పేట్ బషీర్ బాద్ మల్లారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Read also: Singham Again: గేమ్ చేంజర్ తో పోటీ పడనున్న బాలీవుడ్ సూపర్ స్టార్..!
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పడు మరో భూవివాదంలో మల్లారెడ్డిపై కేసు నమోదు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
T20 World Cup: అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్.. యూఎస్ విదేశాంగ ప్రతినిధి ఏమన్నారంటే..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..