Site icon NTV Telugu

Indira Canteen : అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు.. ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’గా

Indira Canteen

Indira Canteen

Indira Canteen : హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి.

Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి

తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను విస్తరించినప్పటికీ, పేరును మాత్రం మార్పు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, ఈ కేంద్రాలకు ఇందిరా గాంధీ పేరిట ‘ఇందిరా క్యాంటీన్లు’గా పునర్నామకరణ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. త్వరలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా రూ.5కే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూనూ తిరిగి డిజైన్ చేస్తున్నారు — ప్రతి ప్లేట్‌లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల ఊరగాయను సమతుల్యంగా చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇకపై ఈ కేంద్రాలను తాత్కాలిక షెడ్‌ల నుంచి శాశ్వత కట్టడాలుగా మార్చే పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలు తుప్పుపట్టిన షెడ్‌ల్లో, శిథిలావస్థలో ఉన్న గదుల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తీసుకుంది. అందులో పేర్కొన్న సూచనల ఆధారంగా పునః నిర్మాణ చర్యలు చేపట్టనున్నారు.
భవిష్యత్తులో కొత్త క్యాంటీన్లను కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్న GHMC, భోజనం తినేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉంది. ఇప్పటివరకు ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా దాదాపు 10 కోట్ల భోజనాలు పేదలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆకలితో ఉన్న ప్రజలకు ఈ క్యాంటీన్లు పెద్ద ఆశ్రయంగా నిలిచినట్లు గుర్తు చేశారు.

YS Jagan: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ

Exit mobile version