Site icon NTV Telugu

తెలుగు తల్లి ముందు కేసీఆర్ మోకరిల్లిండు-రేవంత్ రెడ్డి

హుజురాబాద్ బై పోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం జోరును పెంచాయి. కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్‌ తెలుగు తల్లి ముందు మోకరిల్లిండన్నారు. తెలుగు తల్లిని బరితెగించి తిట్టిన కేసీఆర్ ప్లీనరీలో పెట్టిన స్వాగత తోరణంలో పెట్టింది తెలుగు తల్లినే అని అన్నారు. గులాబీ చీడకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు అందుకే తెలుగుతల్లి తోరణం పెట్టారన్నారు.

టీఆర్‌ఎస్‌ ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీగా ఎదగడానికి ఎందరినో సమిధలు చేసి వారి శవాల మీద విస్తరించుకుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. హౌస్ రెంట్ బోర్డ్ పెడితే 2 వేల ఫైన్ వేశారు. ఈ రోజు నగరాన్ని గులాబీ మయం చేశారు. మహనీయుల విగ్రహాలకు జెండాలు కట్టారు. ఇది వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. జల దృశ్యంలో మొదలైన దోపిడీ దృశ్యం హైదరాబాద్‌లో కనిపిస్తుందన్నారు. నడమంత్రపు సిరితో మిడి మిడి జ్ఞానంతో టీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను ప్రస్తావించలేదు. ఎదుగుదలలో కారణం అయిన వ్యక్తులను గుర్తు చేయలేదని రేవంత్‌ రెడ్డి .. కేసీఆర్‌పై కామెంట్స్ చేశారు.

Exit mobile version