Gadwal Crime: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అనేది ఆడది పెళ్లి తరువాత ఇలా భర్తపట్ల ఇలానడుచుకోవాలనే ఈశ్లోకం పరమార్థం. పని లో దాసి గా, సలహా ఇవ్వడంలో మంత్రి గా,భోజనం పెట్టడంలో తల్లి గా అందం లో లక్ష్మి గా,పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి అని చెప్పారు. కరణేషు మంత్రి: అంటే ఆడవాళ్ళకు తెలివి చాలా ఎక్కువ, వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించాలి అని అర్థం. అయితే ఈ శ్లోకాల అర్థాలు.. నిజజీవితంలో వ్యర్థాలుగా మారుతున్నాయి అనడానికి నిదర్శనం ఈఘటన. ప్రియుడు మోజులో పడి తన భర్తను చంపింది భార్య. అంతేకాదు ఆహత్యను వేరే విధంగా తీర్చి దిద్దింది ఈతల్లి. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని తెరమీదకు తెచ్చింది. ముందు అందరూ నమ్మినా తరువాత భార్యపై అనుమానం వచ్చని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Parliament Winter Sessions: శీతాకాల సమావేశాల్లో 9 బిల్లులకు పార్లమెంటు ఆమోదం
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. దీంతో ఈ విషయం భర్తకు ఎక్కడ తెలుస్తుందో ఏమో అని ఆయన్నే హతమార్చాలని ప్లాన్ వేసింది. ప్రియుడు రఫీతో కలిసి భర్తను హత్య చేసింది. గొంతునుమిలి కతికిరాతకంగా హత్యచేసింది. భర్త ఫిట్స్ వచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించింది. అయితే భార్య మహబూబ్ బి ప్రవర్తనపై అనుమానం వచ్చి మృతుడు మహమ్ముద్ బందువుల భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆశ్చకర విషయాలు బయటపడ్డాయి. భార్య అసలు గుట్టు రట్టు చేశారు. భార్తను చంపింది భార్య, అతని ప్రియుడు అని గుర్తించారు. ఆమెను అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన నల్లకుంట ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్.. 45 నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు..