Site icon NTV Telugu

Bandi Sanjay: పోస్టర్లు వేయడం మొదలుపెడితే.. టీఆర్ఎస్ కాంగ్రెస్ లు తట్టుకోలేవు

Bandi Sanjay, Rajagopal Reddy

Bandi Sanjay, Rajagopal Reddy

Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్‌ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.

read also: Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్‌ ఔట్‌..!

రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్. ఆయన డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని మండిపడ్డారు. ఈనెల 21న అమిత్ షా భారీ బహిరంగ సభ ఉంటుందని, గిట్టని కొంతమంది అమిత్ షా సభ వాయిదా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను చూసి భయపడి రాష్ట్రంలో కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించిందని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయాశంగా మారాయి.

యాదాద్రి భువనిగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో వాల్‌ పోస్టర్లు కలకలం పేరుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా వాల్‌ పోస్టర్లు వెలసాయి. మునుగోడు నిన్ను క్షమించదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రికి రాత్రే మున్సిపల్‌ కేంద్రంలో వాల్‌ పోస్టర్లు ప్రత్యక్షమవడంతో.. తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 22వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్మకున్న ద్రోహివి అంటూ.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్‌ షాను కలిసి బేరమాడిన నీచుడివంటూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇంతకూ ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్నది తేలాల్సి ఉంది.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్‌ ఔట్‌..!

Exit mobile version