NTV Telugu Site icon

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. షెడ్యూల్ ఇదీ..

Amit Shah

Amit Shah

Amit Shah: బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేటకు చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది. ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది. ఇక.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం.

Read also: Double Ismart : షూటింగ్ ఆలస్యం..అసలు ఏమైంది మావ..?

బీజేపీ కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్లు, వివిధ కుల సంఘాలు, యువకులు, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యం. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సమయంలో మాత్రమే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను స్వయంగా కలవడం, కార్నర్‌ మీటింగ్‌లు వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా మిగిలిన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం, కరపత్రాలు, ప్రచార స్టిక్కర్లు, పార్టీ జెండాలు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రాలు అందజేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఓటర్లకు అందిస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండో విడత ప్రచారం, వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో మూడో విడత ప్రచారం పూర్తి కానుంది.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా రహస్యంగా బాలిస్టిక్ క్షిపణులు.. రష్యా ఉక్కు ఫ్యాక్టరీపై దాడి