NTV Telugu Site icon

Ambulance: వర్షపు నీటిలో ఆగిపోయిన అంబులెన్స్.. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన రోగి

Ambulance

Ambulance

Ambulance: హైదరాబాద్‌ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వర్షపు నీరు ఉప్పొంగింది. పలు చోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రులకు వెళ్లే వారు వర్షం వల్ల చాలా ఇబ్బందుల పాలయ్యారు. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరింది. ఆ సమయంలో కోదాడ నుంచి నిమ్స్ ఆస్పత్రికి పేషంట్‌ను తరలిస్తుండగా అంబులెన్స్‌ ఇంజిన్‌లోకి నీరు చేరి అక్కడే ఆగిపోయింది.

Read Also: Health Tips : ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

సుమారు గంట పాటు అంబులెన్స్‌ నీళ్లలోనే ఉండగా.. స్థానికులు అంబులెన్స్‌ను ఎగువ ప్రాంతానికి తీసుకురావడంలో సాయం చేశారు. ఆ సమయంలో రోగిని ఆస్పత్రికి తరలించడానికి బంధువులు ఎంతగానో శ్రమించారు. 100కు డయల్ చేసినా స్పందించలేదని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. రోగికి ఆక్సిజన్‌ లేక ఇబ్బందులు పడ్డామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రోగిని ఆటోలో నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.