Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం కలకలం
- షోరూం స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు
- దట్టమైన పొగతో ఇబ్బంది పడ్డ స్థానికులు
- ఫైర్ సిబ్బంది శ్రమతో అదుపులోకి మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : హైదరాబాద్ లోని అంబర్‌పేట నెంబర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మహీంద్రా , రెనాల్ట్ కార్ల షోరూంలకు చెందిన స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గోదాంలో ఉన్న పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, లెదర్ సీట్లు అంటుకోవడంతో ఆకాశమంతా నల్లటి దట్టమైన పొగ కమ్ముకుంది. కార్ సర్వీసింగ్ సెంటర్లలో మార్చిన పాత వస్తువులను భద్రపరిచే గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే సర్వీసింగ్ కోసం వచ్చిన అనేక కార్లు అక్కడ పార్క్ చేసి ఉండటంతో, మంటలు వాటికి కూడా వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. దీనితో అప్రమత్తమైన షోరూం సిబ్బంది వెంటనే ఆ వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
గోదాంలో టైర్లు, లెదర్ ఐటమ్స్ కాలిపోవడంతో వెలువడిన దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల నివాసితులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. షోరూం వెనుక వైపున ఉన్న అపార్ట్మెంట్లు, నివాస గృహాలకు మంటలు వ్యాపించే ముప్పు ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి ప్రజలను తక్షణమే ఖాళీ చేయించారు. రద్దీగా ఉండే అంబర్‌పేట చౌరస్తాలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి. పొగ ఎక్కువగా ఉండటంతో గోదాం లోపలికి వెళ్లడం సిబ్బందికి కష్టంగా మారింది. వాటర్ స్ప్రే చేయడంతో పాటు పరిస్థితిని బట్టి ఫోమ్ (Foam) ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
- Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..