Site icon NTV Telugu

Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

Indrakaran Reddy

Indrakaran Reddy

Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రెస్‌ మీట్‌ లో ఆయన మాట్లాడుతూ.. కవితను మహిళా అని చూడకుండా రెండు సార్లు ఈడీ అధికారులు వేధింపులు సిగ్గుచేటన్నారు. ప్రధానమంత్రి పైన ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేశారు. రాష్ట్రము పైన కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీలో ఒక్కరి పైన కూడా ఈడి, సిబిఐ విచారణ లేదన్నారు. మల్లారెడ్డి, కమలాకర్ పైన ఈడీ, సిబిఐ వేధింపులకు గురిచేసిందని మండిపడ్డారు.

Read also: R.S.Praveen Kumar: ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పైన రేవంత్ రెడ్డి ఆధారాలు చూపెట్టి మాట్లాడాలని అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవ చేశారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడ వుంది? అని ప్రశ్నించారు. జవహర్ లాల్ నైహ్రు 12 సంత్సరాలు జైల్లో వున్నారని, బీజేపీ ఆదానిపైన మాట్లాడడం లేదన్నారు. ఆదానీపై జేపిసీ వేయాలని, బీజేపీ భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
ABVP Protest: ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై ఏబీవీపీ నిరసన..

Exit mobile version