Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News All Set For Revanth Reddy To Take Oath As Telangana Chief Minister In Hyderabad Lb Stadium

Revanth Reddy: ఇవాళ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. 11 మంది మంత్రులు సైతం..

Published Date :December 7, 2023 , 7:39 am
By Bhanu
Revanth Reddy: ఇవాళ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. 11 మంది మంత్రులు సైతం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revanth Reddy: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాల మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌,మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ‘ఆరు హామీల’ చట్టానికి సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. అలాగే రజనీ అనే వికలాంగ మహిళకు తొలి ఉద్యోగం ఇచ్చిన ఫైల్‌పై సంతకం చేయనున్నారు.

Read also: Revanth Reddy: నేడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిని నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానాలు పంపారు. వీరిలో మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ తదితరులున్నారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా తెలంగాణ క్యాబినెట్ లో నేడు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి‌‌ విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ,శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు ,సీతక్క ,కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మరో 10 మంది మంత్రులు ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని అంటున్నారు.

Read also: Off The Record: ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఎంతమంది పోటీ..? కాంగ్రెస్‌కు దక్కేవి ఎన్ని? డిమాండ్‌ ఎంత?

మరోవైపు రేవంత్ రెడ్డి బుధవారం రోజంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులతో రేవంత్ సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి వీరికి ఆహ్వానం అందింది. భారత కూటమి సభ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన.. లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాను మర్యాదపూర్వకంగా కలుసుకుని సభలో కాసేపు గడిపారు. అనంతరం వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. వారంతా ఆయనకు అభినందనలు తెలిపారు.
Astrology: డిసెంబర్ 07, సోమవారం దినఫలాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • revanth reddy
  • revanth reddy oath
  • telangana cm revanth reddy
  • telangana cm revanth reddy oath

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions