NTV Telugu Site icon

SAGY: ఆదర్శ గ్రామాలు.. టాప్‌ 10లో మొత్తం తెలంగాణ గ్రామాలే..

Sagy

Sagy

జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.. టాప్‌లో నిలవడం అంటే.. ఒక్క స్థానం కాదు.. అందులో ఉన్న పదకి పది స్థానాలు కొల్లగొట్టింది.. గతంలోనూ ఈ జాబితాలో టాప్‌ 10లో ఆరు, ఏడు స్థానాలు దక్కించుకున్న సందర్భాలు ఉండగా.. ఈ సారి ఏకంగా టాప్‌ 10 మొత్తం తెలంగాణ గ్రామాలే కావడం విశేషం.. తాజాగా కేంద్రం విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై) జాబితాలో పదింటిలో 10 గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం నుంచే చోటు దక్కించుకున్నాయంటే.. రాష్ట్రంలోని పల్లెల్లో జరుగుతోన్న అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది.

Read Also: KCR behind PK: కేసీఆర్‌ భేటీ తర్వాత మారిన పీకే మనస్సు..!

దేశంలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, గ్రామ సంఘాల ఐక్యత, సామాజిక సమీకరణపై ప్రజలలో చైతన్యం పెంపొందించడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం.. తాజా జాబితాలో మరో రాష్ట్రానికి అవకాశం ఇవ్వకుండా.. అన్ని స్థానాలు కైవసం చేసుకుంది తెలంగాణ.. అంతే కాదు.. ఈ జాబితాలో టాప్‌ 20 స్థానాల్లో ఒకే ఒక్క స్థానం మిన‌హా మిగతా 19 స్థానాలు కూడా తెలంగాణ గ్రామాలే ఉండడం మరో విశేషం. ఈ జాబితాలో యాదాద్రి జిల్లాలోని వడ్డేపర్తి టాప్‌లో నిలవగా.. కరీంనగర్‌లోని కొండాపూర్‌, నిజామాబాద్‌లోని పల్డా, కరీంనగర్‌లోని రామకృష్ణాపూర్, యాదాద్రిలోని వెల్మాల్‌, జగిత్యాలోని మూలరాంపూర్, నిజామాబాద్‌లోని థన్‌ కూర్దు, కుక్నూర్‌, కరీంనగర్‌లోని వెన్నంపల్లి వరుసగా టాప్‌ 10లో నిలిచాయి. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. గ్రామాల‌ను అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లేలా చేసిన సీఎం కేసీఆర్‌ విజన్‌కు మంత్రి పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మరియు మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు కేటీఆర్.