NTV Telugu Site icon

Mallanna Jatara: ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు..

Inavolu Mallanna Jatara

Inavolu Mallanna Jatara

Mallanna Jatara: వరంగల్ జిల్లా ఐనవోలు జాతరకు భక్తులు పోటెత్తారు. భోగి పర్వదినం, ఆదివారం సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. మల్లన్న దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడతుంది. ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీల సందడి చేశారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ దర్శించుకునేందుకు వచ్చారు. ఐనవోలు మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read also: Ponnam Prabhakar: జ్యోతిషం చెప్పినట్లు ఉంది.. బండి‌ సంజయ్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్..

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర నిన్న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి, రేపు (15న) సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగుబంగారంగా కొలిచే అయిలోని మల్లన్న ఉత్సవాలకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దాదాపు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. అధికారులతో పాటు ఆలయ కమిటీ కూడా భక్తుల రాకపోకలకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీ ఏర్పాటు పూర్తీ చేశారు. ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్.. కారణం ఇదీ..