Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ.. విమర్శలు, ఆరోపణల పర్వం ఓవైపు.. ప్రచారం, లీక్‌ల పర్వం మరోవైపు సాగుతోంది. పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారి చర్చకు దారితీస్తుండగా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆయన మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఆడియో లీక్ అయ్యి వైరల్‌గా మారితే.. ఇప్పుడు వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. దీనిపై స్పందించిన ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ కావడం పై ఎఐసిసి సిరీయస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని AICC నోటీస్ లో పేర్కొంది.

Also Read
రెండురోజుల నుంచి 21, 22న పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారిపోయింది. చావు, బతు, చెడు, మంచి, పెళ్లి, పిల్లలు.. ఇలా అన్నింటికీ తన సోదరుడు సాయం చేస్తూ ఉంటాడు.. పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని కోరిన ఆయన.. ఈ దెబ్బతో నేను పీసీసీ చీఫ్‌ను అవుతాను.. మార్చిలో పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.. ఇది పెద్ద రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. మెల్బోర్న్లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అని తేల్చేశారు కోమటిరెడ్డి.. నేను వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయి.. తప్ప గెలవబోమన్నారు.. దానికి కారణం కూడా చెప్పారు కోమటిరెడ్డి.. రెండు అధికార పార్టీలు (టీఆర్ఎస్-బీజేపీ) కొట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అని ప్రశ్నించారు. డబ్బులు కాంగ్రెస్ పెట్టలేదు అన్నారు.. నేను 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశా.. ఎంపీగా కొనసాగుతున్నాను.. చాలు ఇక విశ్రాంతి తీసుకుంటానన్నారు.. రాష్ట్రంలో పాదయాత్ర చేద్దామనుకున్నా.. కానీ, కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదే… ఓడిపోయే సీటుకు ప్రచారం చేసేది ఎందుకు..? అని ఎదురు ప్రశ్నించారు.. అంతేకాదు, నేను మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పలేనని కుండబద్దలు కొట్టేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఏఐసీసీ ఆడియో వీడియోలతో సీరియస్ తీసుకుంది. ఆయనపై సోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!