Site icon NTV Telugu

Jana Reddy: ఏంజరిగిందో నాకు తెలియదు.. ఆయన్నే అడిగి తెలుసుకోండి

Janareddy

Janareddy

Jana Reddy: గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బందిపై టీపిసిసి అధ్యక్షులు పొన్నాల ఫైర్‌ అయన విషయం తెలిసిందే.. దీంతో.. పొన్నాలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి సముదాయించారు. అనంతరం ఓటు వినియోగించుకున్న జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. పొన్నాల వివాదం ఏంటి సార్‌ అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. వివాదం ఏంటిదో నాకు తెలియదు. నువ్వు తెలుసుకొని వచ్చి నాకు అడిగితే అప్పుడు చెబుతానంటూ సీరియస్‌ గా మాట్లాడారు జానారెడ్డి. మళ్లీ కూల్‌ గా దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంతర్వాత ఏఐసీసీకి డెమక్రటిక్‌ గా ఎన్నికలు జరగడం ఎలక్షన్స్‌ లో దేశంలోని కాంగ్రెస్‌ వర్గాలు మొత్తం పాల్గొనడం కాంగ్రెస్‌ పార్టీకి ఒక మలుపుకు సాంకేతం అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్‌ జరగాలని కోరారు. వాదాలు, వివాదాల గురించి, ఇతర సమస్యల గురించి మాట్లాడటం తనకు సమంజసం కాదని తెలిపారు. పొన్నాల కోపడ్డారు ఏంటని మీడియా అడగ్గా ఏంజరిగిందో నాకు తెలియదు.. ఆయన్నే అడిగి తెలుసుకోండంటూ మాటమార్చారు జనారెడ్డి.

read also: AICC President Election: గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బందిపై పొన్నాల ఫైర్‌..

గాంధీభవలో ఓటు వేయడానికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని ఎన్నికల సిబ్బంది నిరాకరించింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌ కు ఓటు ఇవ్వడంపై రగడ మొదలైంది. శ్రీనివాస్‌ రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరికి మాత్రమే ఓటింగ్‌ కు అవకాశం ముందని ఓటింగ్‌ సిబ్బందిపై ఫైర్‌ అయ్యారు. జనగామ నుంచి పొన్నాలతో పాటు శ్రీనివాసరెడ్డికి ఏఐసీసీ ఐడీకార్డు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వేళ గాందీభవన్‌ వద్ద పొన్నాల గరంగరం అయ్యారు. 45ఏళ్ల కాంగ్రెస్‌ మనిషికి అవమానమని పొన్నాల మండిపడ్డారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్​లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఎల్లుండి ఓట్లు లెక్కింపు జరగనుంది.
Special Story On Patanjali: పొరపాట్లను సరిచేసుకున్న పతంజలి.. పడి లేచిన కెరటమవుతుందా?

Exit mobile version