Adulterated Food : మీరు అసలు మనుషులేనారా.. వీటిని కూడా కల్తీ చేస్తున్నారు..!
- గచ్చిబౌలిలో కల్తీ ఆహార పదార్థాల తయారీ గుట్టు రట్టు
- గడువు ముగిసిన నూనెలతో మళ్లీ ప్యాకింగ్ చేసి విక్రయం
- రూ.21 లక్షల విలువైన కల్తీ నూనె, గోధుమ పిండి స్వాధీనం
- ఇద్దరు నిందితుల అరెస్ట్.. దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Food in Hyderabad: రోజురోజుకు ఎక్కడ చూసినా కల్తీ కాని ఆహారం పదార్థం ఉందా అని అనుమానాలు పెరుగుతున్నాయనడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు. కనీస మానవత్వం కూడా లేకుండా ధనార్జనే లక్ష్యంగా ఈ కల్తీదందా నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టు రట్టు చేశారు SOT పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి SOT టీమ్ గచ్చిబౌలి పరిధిలోని వట్టి నాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి నిర్వహించారు.
దాడిలో రాజస్థాన్‌కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు బయటపడింది.
Also Read
G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!
ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనె (సుమారు రూ.10,55,460 విలువ) , 5,192 కిలోల గోధుమ పిండి (సుమారు రూ.3,11,520 విలువ) స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా ఒక వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు , TS07UL2884 నంబర్ టెంపో ట్రాలీ ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ.21,91,980గా అంచనా వేశారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46) అతని కుమారుడు, అశోక్ కుమార్ (22)లను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!