Adluri Laxman Kumar: నోరు ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే మల్లారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుచిత్రలో 2015లో సర్వేనెంబర్ 82/ఈ లో 600 గజాల ల్యాండ్ ను కొనుగోలు చేశానని తెలిపారు. నాతోపాటు ఆరు మంది కలిసి సుధామ నుండి సేల్ డిడి చేసుకున్నామన్నారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మిగితా వారు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. మాకు సేల్ డిడి చేసిన సుధామ 2000 సంవత్సరంలోనే ఆ ల్యాండ్ ను కొనుగోలు చేశారని తెలిపారు. అతని నుండి మేము ల్యాండ్ కొనుగోలు చేశామన్నారు. మేము ల్యాండ్ సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నాడన్నారు.
Read also: CPI Narayana: ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుంది..
మేము శ్రీనివాస్ రెడ్డికి ఆ ల్యాండ్ ను 2021లో అమ్మేశామని క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ ఇచ్చిన రికార్డ్స్ ఆధారంగా భూమి కొనుగోలు చేశామన్నారు. మాకు 2016 నుండి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించి ఇన్ని రోజులు దౌర్జన్యం చేశాడు.. ఇంజక్షన్ ఆర్డర్ ను ఎందుకు వెకెట్ చేయించలేదన్నారు. మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఆయన అరాచకాలను తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీపై నోరు ఉంది కదా అని ఎమ్మెల్యే మల్లారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ ల్యాండ్ వివాదంలో అనేకసార్లు మల్లారెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని కలిసి సెటిల్ చేయమని అడిగానని పేర్కొన్నారు. వాళ్లకి ల్యాండ్ లేనప్పటికీ దౌర్జన్యంగా ల్యాండ్ కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Warangal Airport: వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు..?
తనకు 2 వేల ఎకరాల భూమి ఉందని చెబుతున్న మల్లారెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి మంత్రిగా పని చేస్తున్న మల్లారెడ్డి తన భూమి అని చెబుతున్నా అందులో నిర్మాణ పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 2016లో కోర్టు వారికి ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే, ఎందుకు ఖాళీ చేసేందుకు ప్రయత్నించలేదు? సర్వే చేయాలని నోటీసు ఇస్తే సర్వే అవసరం లేదని వియ్యంకుడు లక్ష్మారెడ్డి నుంచి సమాధానం పంపినట్లు వెల్లడించారు. మల్లారెడ్డి తన వద్ద హక్కు పత్రాలుంటే సర్వే చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారో మల్లారెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Mlla Reddy: మల్లా రెడ్డి భూ వివాదం… భారీ బందోబస్తు మధ్య సర్వే..