NTV Telugu Site icon

MP Soyam BapuRao: సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారు.. ఎంపీ నిధులతో ఇళ్లు కట్టాను, పెళ్లి చేశాననేది అవాస్తవం

Soyam

Soyam

MP Soyam BapuRao: తన పై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. అయితే ఇవాళ జరిగిన స్థానిక బీజేపీ నేతల సమావేశంలో సోయం బాపురావు.. ఎంపీ ల్యాడ్స్ నిధులను కొడుకు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం వాడుకున్నట్లు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

Read Also: China: అమెరికా విదేశాంగ మంత్రితో జీ జిన్‌పింగ్ భేటీ.. ఇరుదేశాల సంబంధాలే లక్ష్యంగా చర్చలు

తాను ఎంపీ లాడ్స్ నిధులతో ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను అనేది అవాస్తవమన్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను అలా అనలేదని.. రమేష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు క్యాడర్ కు ఇస్తే పార్టీకి క్యాడర్ కు తనకు పేరు వచ్చింది కనుక ఆ నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ లాడ్స్ తాను వాడుకోలేదని.. తన ఇంటికి లేదా తన కుమారుడి వివాహానికి వాడుకునే అస్కారమే లేదన్నారు.

Read Also: Bihar : వడదెబ్బకు తండ్రి మృతి.. దహన సంస్కారాలకు వెళ్లి వచ్చిన తర్వాత కొడుకు

సొంత పార్టీ నేతల కుట్రలో భాగమే ఆ వీడియోనని ఎంపీ బాపురావు అన్నారు. ఆ వీడియోలో ఉన్నట్లు తాను మాట్లాడలేదన్నారు. ఈ విషయంపై మాజీ ఎంపి రమేష్ తో పాటు పాయల్ శంకర్ లపై అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
నేను దందాలు చేయను.. దందాలు చేసే నాయకులు నాపేరు వాడుకుంటున్నారని ఎంపీ అన్నారు. అది నచ్చకనే కఠినంగా వ్యవహరించాను కాబట్టే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు నేను పార్టీ మారుతానని సైతం ప్రచారం చేస్తున్నారని.. పార్టీ మారను…బీజేపీలోనే ఉంటానని తెలిపారు. శాశ్వతంగా బీజేపీలోనే కొనసాగుతానని ఎంపీ సోయం బాపురావు అన్నారు.