Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తోడు కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పులులు అడవులు, కొండ,గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్నట్లు తెలిపారు. మెటింగ్ సీజన్ కావడంతో ఆ రెండు కలుస్తాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుండి నిర్మల్, బోథ్ సరిహద్దు మండలాల్లోకి ప్రవేశించన పులి జానీగా గుర్తించారు. గత నెల 23 న తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
మరో వైపు రెండు నెలల క్రితం కొమురం భీం జిల్లా కెరమేరి అడవుల్లోకి వచ్చిన ఆడ పులి జోడేఘాట్ అడవుల్లో సంచరించింది. ప్రస్తుతం రెండు టైగర్స్ సమీపంకు చేరుకున్న ట్లు అధికారులు గుర్తించారు. కేవలం పదుల కిలో మీటర్ల దూరంలోనే రెండు పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. రెండు పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆయా గ్రామాల్లో పులి రక్షణపై జనంకు అవగాహన కల్పిస్తు్న్నారు. పులులకు హాని తలపెట్టే ఉచ్చులు, విద్యుత్ వైర్లు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులులకు హాని తల పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. పశువులపై పులులు దాడి చేస్తే వెంటనే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు.
Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..