Minister Seethakka: ఆదిలాబాద్ జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు. గత పదేళ్లుగా ఆక్రమించిన భూ భాగోతం మొత్తం బయటకొస్తుందనే భయం వారికి పట్టుకుంది.. ఇంట్లో కూర్చోని ధరణి తయారు చేశారు.. విచ్చల విడిగా దొంగ వార్తలు ప్రచురిస్తున్నారు.. భూ భారతిలో వాళ్ల ఆగడాలు బయటకు వస్తాయనే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు వార్తలకు ప్రయార్టీ ఇస్తున్నారు.. ప్రజలు ఆలోచించాలి అని సూచించారు. వాళ్ల లాగా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదు.. మాది ప్రజల ప్రభుత్వం.. ధరణికి భూ భాతరతికి చాలా తేడా ఉంద అని మంత్రి సీతక్క వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది
అయితే, అధికారులు తప్పుడు పనులు చేయకండి అని మంత్రి సీతక్క కోరారు. గత ప్రభుత్వం వీఆర్ఓలను వాడుకోని వదిలేశారు.. పేదల హక్కులు తీసేసి బడా బాబులకు అనుకూలంగా వాడుకున్నారు.. ఇక, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంత మంది లీడర్లు డిక్టేటర్లుగా వ్యవహరిస్తున్నారు.. మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు ప్రయార్టీ ఉంటదని తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. బీసీ బిల్లు కోసం ఎదురు చూస్తున్నాం అని పేర్కొనింది. జిల్లాలో ఎన్ని గ్రూపులు ఉన్నా సరే నేను సిన్సియర్ గా పని చేస్తున్నాను.. కొంత మంది తప్పును ప్రశ్నిస్తే వాళ్లకు నచ్చడం లేదు.. ఎంపీ ఎన్నికల్లో 4 లక్షల ఓట్లు తెప్పించాం.. అక్కడక్కడ లీడర్లు వేరే వాళ్లకు పదవు ఇవ్వొద్దని అంటున్నారు.. అలాంటి ఆలోచన తప్పు అన్నారు. రాజకీయం అంటేనే అందరు ఉండాలి.. అప్పుడు పబ్లిక్ లీడర్ గా పేరు వస్తుందని సీతక్క చెప్పుకొచ్చింది.
