Farmers Protest: అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద అదిలాబాద్ రైతులు హడావుడి చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా సోయా బీన్ పంటకు నష్టం వాటిల్లింది. రంగు మారిందని సోయా బీన్ పంటను కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులం మంత్రిని కలవడానికి వచ్చామని పేర్కొన్నారు. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్పారు.
Read Also: US-Venezuelan: ట్రంప్ హెచ్చరికలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు
అయితే, 2,80,000 క్వింటాల్ కి పైగా సోయా బిన్ పంటను కొనుగోలు చేయాల్సి ఉంది.. రైతుల దగ్గర నిలువ ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయా బీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువనే వచ్చింది. 6, 280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటల్ పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తామని రైతులు తెలిపారు. పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.