Site icon NTV Telugu

Samantha: కేటీఆర్ కు సామ్‌ ట్వీట్..!. ఎందుకంటే..?

Ktr Samantha

Ktr Samantha

నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. అంతే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలను సైతం తన దైన శైలిలో సామ్ రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సామ్ ప్రశంసల జల్లు కురుపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత.

అయితే ఇంతకీ కేటీఆర్ ను సామ్ ఎందుకు పొగిడిందనే విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద టీహబ్ రెండో దశలో భాగంగా రాయదుర్గంలో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే ఈ నిర్మాణానికి జూన్ 28న ముహూర్తం ఖరారైంది. ఈవిషయాన్ని మంత్రి కేటీఆర్ తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ చేసిన ట్వీట్ కు హ్యాపెనింగ్ హైదరాబాద్ అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు చాలా గర్వంగా ఉందంటూ రీట్వీట్ చేస్తూ .. కేటీఆర్ ను ట్యాగ్ చేశారు సమంత.

అయితే ఇది ఇలా వుంటే.. మంత్రి కేటీఆర్ ట్వీట్ పై పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని హీరో విజయ్ దేవరకొండ రీట్వీట్ చేశాడు. దీంతో ఎన్నో ఉద్యోగాలు కల్పించేందుకు వీలుపడుతుందని విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నానాటికీ సాధిస్తున్న ప్రగతి హర్షణీయమని విజయ్ దేవరకొండ స్పందిచారు.

అయితే.. జూన్ 28న నూత‌న టి-హబ్ బిల్డింగ్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టి-హబ్ కొత్త బిల్డింగ్‌ని 26న ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నుండ‌టం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సుమారు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన టీహ‌బ్‌.. ఇది భారతదేశపు అతిపెద్ద నమూనా సౌకర్యంగా భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. దీనిని నిర్మించడానికి దాదాపు 276 కోట్ల రూపాయలు ఖర్చ చేసినట్లు మంత్రి తెలిపారు. 1,500 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఈ భవనంలో ఉంటాయని అన్నారు. టీ-హబ్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేటీఆర్ అన్నారు. అయితే ఇది ఇప్పటివరకు 1,120 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు హైదరాబాద్‌లో 2,500 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడిని సమకూర్చడంలో సహాయపడిందని కేటీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version