Site icon NTV Telugu

CPI Narayana: లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

Cpi

Cpi

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం గౌరవెల్లి నిర్వాసిత గ్రామవాసులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిన్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణ‌మ‌ని అన్నారు.

లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో సీపీఐ పాత్ర కూడా ఉందని, అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా త‌మ పార్టీ కాపాడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగేంత వరకు అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ మాటలు ఏమయ్యాయని, ఆయ‌న కుర్చీ ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు.

నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద‌ని మండిప‌డ్డారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు సీపీఐ పోరాడుతుందని చెప్పారు. కేసీఆర్ మేన‌ల్లుడు హరీశ్ రావు గౌర‌వెల్లిలో కుర్చీ వేసుకుని కూర్చుని బాధితులకు న్యాయం చేయాలని నారాయ‌ణ అన్నారు.

Tollywood: జూలై 1 నుంచి స్ట్రయిక్?

Exit mobile version