రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు పైనే ముగ్గరు యువకులు ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
read also : రామ్ చరణ్‌గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్..
రోడ్డు పై పడివున్న మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతులు లంగర్ హౌజ్ ప్రాంతానికి చెందిన షేక్ ఖమరుద్దీన్, సయ్యద్ జమీల్, సయ్యద్ బబ్లూ గా గుర్తించారు. అంతేకాదు… మృతులు కూరగాయల వ్యాపారులుగా గుర్తించిన పోలీసులు… చంద్రయాన్ గుట్ట నుండి మైలార్ దేవిపల్లి మీదుగా లంగర్ హౌజ్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. మైలార్ దేవిపల్లి దుర్గా నగర్ వద్దకు రాగానే ఒక్కసారిగా రోడ్డు పై మోటర్ సైకిల్ స్కిడ్ అయింది.. దీంతో రోడ్డు పక్కకు పడిపోయారు ముగ్గురు యువకులు. అప్పటికే వెనకాల నుండి మితిమీరిన వేగంతో సిమెంట్ రెడీ మిక్స్ లారీ దూసుకు వచ్చింది. దీంతో స్పాట్ లోనే ముగ్గురు మరణించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.