Site icon NTV Telugu

ఫీవర్‌ సర్వేలో షాకింగ్‌ నిజాలు

కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి అందజేయనుంది.

Read Also: అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎండీఏ ఫోకస్‌

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు 2500 పైగా కేసులు నమోదువుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాలు కీలకం కాబోతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. తాజాగా ఈరోజు 3,557 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బారిన పడటం అటు ఆరోగ్య శాఖను కలవర పెడుతుంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. నగరంలో ప్రముఖ సంస్థలు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇస్తున్నాయి. తప్పని సరిగా ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్యాధికారులు తెలిపారు.

Exit mobile version