Abhiyan Employees: రెగ్యులర్ చేయండి.. సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhiyan Employees: తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు గత 8 రోజులుగా చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధికరించాలని హనుమకొండ జిల్లా ఏకాశీల పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత 8 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యాశాఖలో విలీనం చెయాలని డిమాండ్ చేస్తున్నారు. పోతారాజు వేషంతో, మహిళలు బోనాలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చేయాలమ్మ చేయాలని అంటూ పోతురాజుల వేశధారతో వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. కనీస కాలపరిమితిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం ఏళ్ల తరబడి జాప్యం చేయడం సరికాదన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమైనారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు చెబుతున్న అమలులో ప్రభుత్వ యంత్రాంగం సంవత్సరాలుగా జాప్యం చేయడం సరి కాదన్నారు.
Also Read
- Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
- Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
19 ఏళ్లుగా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా సీఆర్పీలు పనిచేస్తున్నారని, అందరికీ విద్య అందించడంలో వారి పాత్ర ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేశారని, సహజ మరణమైతే రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మృతులను ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవని, వారి జీవితాలు అనాథలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లకు ఏడాదికి 10 నెలల వేతనాలు మాత్రమే ఇస్తున్నందున వారికి 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులుగా గుర్తించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, జీవిత బీమా, ట్రావెలింగ్ అలవెన్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Errabelli Dayakar Rao: అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో జమ చేస్తాం
తాజావార్తలు
-
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!