Site icon NTV Telugu

Aam Aadmi Party: ఏప్రిల్‌ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర..

పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీలో మరింత జోష్‌ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు.. అందులో భాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు..

Read Also: AP: కేబినెట్‌ విస్తరణపై జగన్‌ క్లారిటీ.. వాళ్లకే అవకాశం..!

ఈ పాదయాత్ర ద్వారా ఆమ్‌ ఆద్మీ పథకాలను ఇంటి ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు సోమనాథ్ భారతి.. ఇక, తొలగించిన ఫెల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం కట్టించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సూచించారు.. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని మండిపడ్డ ఆయన.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ అంశంపై మాట్లాడలేదని విమర్శించారు.. ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాడిందని తెలిపారు. ఇక, ఫీల్డ్ అసిస్టెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను సీఎం కేసీఆర్‌ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన సోమనాథ్‌ భారతి.. ఆ నిధులు దుర్వినియోగం పై కేంద్ర డెవెలప్మెంట్ సెక్రటరీకి లేఖ రాసినట్టు వెల్లడించారు.

Exit mobile version