గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో ట్విస్ట్ !
గాంధీ ఆస్పత్రిలో జరిగినఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. మెడికల్ రిపోర్ట్ నమూనా పరీక్షల్లో… మత్తుమందు ప్రయోగం ఆనవాళ్లు కనిపించలేదు. ఇప్పుడీ మెడికల్ రిపోర్టే ఈ కేసులో.. కీలకంగా మారింది. తమకు నిందితులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది బాధితురాలు. దీంతో బాధితురాలి నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించింది ఫొరెన్సిక్ బృందం. వీటిలో క్లోరోఫామ్ సహా ఇతర మత్తు పదార్థాలేవీ కనిపించలేదని.. నివేదిక ఇచ్చింది.ఇప్పటికే బాధిత మహిళ సోదరి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. ఆమె బయటకు వెళ్ళే సీసీటీవీ దృశ్యాలను సేకరించిన పోలీసులకు.. ఆ తర్వాత ఆమె ఎటు వెళ్ళిందనే దానిపై స్పష్టత రాలేదు.
Read: మధ్యప్రదేశ్‌కు జ్యోతిరాదిత్య అదిరిపోయే గిఫ్ట్…
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..
అనుమానితులు ఉమామహేశ్వర్‌తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు.. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలోలో అత్యాచారానికి అవకాశమే లేదన్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు. ప్రాథమిక నివేదికలోనూ ఇదే తేలిందన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందనీ… సిబ్బందితో సమావేశం నిర్వహించమనీ చెప్పారు. అనుమానితుడు ఉమామహేశ్వర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు తెలిపారు రాజారావు. గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్సయ్యింది. బాధితుల ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!