Baby girl for sale:మానవత్వం నశిస్తుంది. మాతృత్వం క్షీణిస్తుంది. కన్న బిడ్డల్నే అమ్మకానికి పెడుతున్న దేశంగా మారే పరిస్థితి వస్తుంది. అమ్మా అనే మాటకోసం పరితపించే కాలం మంటగలిసిపోతోంది. అమ్మా అనే పదం కన్నా డబ్బు కోసం కన్నపేగునే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Manchryala Maoist letter: అధికారులు ఖబర్దార్.. మావోయిస్టుల సీరియస్ వార్నింగ్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పసి బాలుడి అమ్మకం కలకలం రేపింది. కన్నతల్లే పుట్టిన శిశువును అమ్మకానికి పెట్టింది. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పది రోజుల తరువాత కొనుగోలు యవ్వారం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని నివాసముంటున్న నంద అనే మహిళ పది రోజుక్రితం అంబులెన్స్ లో ప్రసవం అయింది. ఆతర్వాత ఇంటికెల్లాక కరీం అనే వ్యక్తికి బాబును అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో వారి పిలిపించి విచారణ చేపట్టారు. ఆతల్లి తన బాలుడిని 25 వేలకు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో తల్లి, తల్లి చెంతకు బాలుడు చేరాడు. అయితే నేను అమ్మలేదు..పిల్లలు లేరని బతిమిలాడితే ఓ వ్యక్తికి ఇచ్చానని ఆతల్లి పోలీస్ స్టేషన్ లో చెప్పింది. అయితే బాలుడిని తానే తీసుకుంటానని చెప్పడం కొసమెరుపు. అసలు ఏం జరిగింది…ఎంతకు విక్రయించారు..అందులో ఎవ్వరిపాత్ర ఉందనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్ట పోలీసులు తెలిపారు.
T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు