ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని పెద్దలు అంటుంటారు. కానీ అమ్మాయి అంటే సమాజంలో ఇప్పటికీ ఓ చిన్నచూపే ! మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు.
మానవత్వం నశిస్తుంది. మాతృత్వం క్షీణిస్తుంది. కన్న బిడ్డల్నే అమ్మకానికి పెడుతున్న దేశంగా మారే పరిస్థితి వస్తుంది. అమ్మా అనే మాటకోసం పరితపించే కాలం మంటగలిసిపోతోంది. అమ్మా అనే పదం కన్నా డబ్బు కోసం కన్నపేగునే అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.