NTV Telugu Site icon

Congress letter: కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ

Latter

Latter

కాంగ్రెస్ పార్టీలో జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ కలకలం రేపుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకంలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఏఐసీసీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆ లేఖలో జనగామ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని రద్దు చేయాలనీ కోరారు.

Read Also: Kodali Nani: ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వోచ్చావా..? యార్లగడ్డపై సెటైర్లు

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఇద్దరు డీసీసీ ప్రతిపాదిత అభ్యర్థులు పార్టీ సీనియర్ కార్యకర్తలు, దశాబ్దాల నుంచి పార్టీకి తన విలువైన సమయాన్ని అందించారని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్ ని తప్పుదారి పట్టించారు అని పేర్కొన్నారు. కానీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీతో పాటు ఇతర నాలుగు పార్టీలు మారిన తర్వాత అతను డిసెంబర్ 2018 కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని కాంగ్రెస్ విధేయుల లేఖలో తెలిపారు. ఇతర ఇద్దరు డీసీసీ ప్రతిపాదన అభ్యర్థులు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగాం జిల్లాకు చెందిన వారు కాదు.. అతను సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తి అని అన్నారు.

Read Also: Weight Loss : మెంతులతో ఇలా చేస్తే చాలు.. ఎంత పెద్ద పొట్ట ఉన్నా మంచులా కరిగిపోతుంది..

ఇక, కాంగ్రెస్ విధేయుల లేఖలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సిఫార్సు చేశారని రాసుకొచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ నేతలకు భారీగా డబ్బులు ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి పీసీసీ అధ్యక్షుడిపై మండిపడ్డారు.. తన పీసీసీ అధ్యక్ష పదవి కోసం తెలంగాణలో రాహుల్ జీ భారత్ జోడో యాత్రలో వెంకట్ రెడ్డి అస్సలు పాల్గొనలేదు.. పీసీసీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఆయన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయలేదు.. ఎందుకంటే అతని స్వంత సోదరుడు బీజేపీ నుంచి పోటీ చేశాడు అని ఆ లెటర్ లో తెలిపారు. అలాగే, డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని కోరుతున్నామన్నారు.

Show comments