కాంగ్రెస్ పార్టీలో జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ కలకలం రేపుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకంలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఏఐసీసీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆ లేఖలో జనగామ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.