Khammam: నా భార్యకు గుండె కుడివైపు ఉంది నాకొద్దు.. ఏం జరిగిందంటే..!
- కుడివైపు గుండె ఉందని భార్యను వదిలేసిన భర్త
- పెళ్లయిన 15 రోజులకే కోడలిపై అత్తమామలు వేధింపులు
- 2019లో గంగాభవాని ఖమ్మం మహిళా ఠాణాలో ఫిర్యాదు
- మనోవర్తి రూ.10 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం
- పట్టించుకోని భర్త కుటుంబం
- న్యాయం కోసం బోనకల్లు పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: సాధారణంగా ప్రతి ఒక్కరి గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఒక యువతి గుండె కుడి వైపున ఉంది. నిజం చెప్పాలంటే దేవుడు మనిషిని చేస్తాడు. ఆ దేవుడు చేసిన తప్పుకు ఆమె ఏం చేస్తుంది. తన తల రాత అనుకుని బతికేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమెకు పెళ్లైంది. భార్య భర్త బాగానే కాపురం చేసుకున్నారు. ఇంతలోనే భర్తకు గుండె పగిలే వార్త వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కుడివైపు గుండె ఉందని తెలిసింది. ఇది తెలిసిన భర్త నువ్వు నాకు వద్దంటూ ఇంట్లోనుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ భార్య కోర్టు ఆశ్రయించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
ఖమ్మంలోని జయనగర్ కాలనీలో నివసించే అబ్బనాపురి వెంకటేశ్వర్లు విజయలక్ష్మి కుమార్తె గంగాభవానిని బోనకల్లులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తౌడోజు వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో 2018లో వివాహం జరిపించారు.పెళ్లయిన 15 రోజులకే అత్తమామలు గంగాభవానిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే ఆమెకు గుండె కుడివైపు ఉందని ఆరోపిస్తూ ఆమెను పుట్టింటికి పంపించారు. 2019లో గంగాభవాని ఖమ్మం మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు తీర్పు వెలువడే వరకు మనోవర్తి ప్రతినెలా రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది. భాస్కరాచారి స్పందించకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. మనోవర్తి ప్రతినెలా రూ.10 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
Read also: SCO vs AUS: స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు
అయినా భాస్కరాచారి కుటుంబం పట్టించుకోలేదు. 2022లో ఖమ్మం కోర్టులో రాజీ కుదుర్చుకుని రూ.13 లక్షలు చెల్లించేందుకు పెద్దల ముందు అంగీకరించినా తర్వాత మొండి చేయి చూపారు. మనోవర్తిని డబ్బులు అడిగేందుకు తల్లి విజయలక్ష్మితో కలిసి గంగాభవాని శుక్రవారం బోనకల్లులోని మేనమామ ఇంటికి వెళ్లింది. గంగాభవానిపై అత్తమామలు వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగాభవాని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనకు అన్యాయం చేసి గాయపరిచిన భాస్కరాచారి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బోనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
Devara : రిలాక్స్ మోడ్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సెంటిమెంటే కారణం
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!