Site icon NTV Telugu

Mahabubnagar: మహబూబ్‌నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ

Mahaboobnagar Kalti Kallu

Mahaboobnagar Kalti Kallu

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కల్తీ కల్లు ఘటనపై సుమోటో దాఖలైన అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 13న మహబూబ్ నగర్ కు చెందిన సీహెచ్ అనిల్ కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. కల్తీ కల్లు తాగి ఆశన్న, విష్ణు ప్రకాష్, రేణుక మృతి చెందారని, 42 మంది ఆస్పత్రి పాలయ్యారని లేఖలో పేర్కొన్నారు. బాధితులను మంత్రి పరామర్శించి కల్లును పరీక్షలకు పంపించి కల్తీ చేసినట్లు తేలితే విక్రయదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వివరించారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.

Read also: Manipur: మణిపూర్‌లో కేంద్ర మంత్రి రంజన్‌ సింగ్‌ ఇంటిపై పెట్రో బాంబు దాడి

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కల్తీ కల్లు ముగ్గురు మృతి చెందగా.. సుమారు 40 మంది మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి పాలయ్యారు. ఈ కల్తీ కల్లు ఘటన మహబూబ్‌నగర్ జిల్లా తాండాల్లో ప్రస్తుతం కలకలం రేపిందివ. బాధితులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. నోరు మెదపలేక నోరు మెదపకుండా చూస్తూ ఉండిపోయారు. బాధితుల లక్షణాలతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ కల్లు డోస్ విపరీతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. కల్తీ కల్లులో ఏమి కలుపుతారు? అధికారులు విచారణ చేస్తున్నారు. మట్టిలో యూరియా, కుంకుమపువ్వు రసం, నిమ్మకాయ ఉప్పు, సక్కరి పొడి, బియ్యప్పిండి, రసాయనాలు కలుపుతున్నారు. ఇలాంటి పదార్థాలతో కల్తీ కల్లు ఎక్కువగా తాగితే లివర్ అబ్సెస్ రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. అడిక్ట్ అయ్యి సమయానికి తాగకపోతే ఫిట్స్ వస్తాయని, అదే పనిగా మతిస్థిమితం కోల్పోతారని అంటున్నారు. మెదడులో రియాక్షన్ వల్ల కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీ కల్లు దందాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కల్తీ కల్లు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించిన విషయం తెలిసిందే..
Adipurush Craze: పిల్లల్లో పిచ్చి క్రేజ్ తెచ్చిన ఆదిపురుష్.. థియేటర్‌లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు

Exit mobile version