NTV Telugu Site icon

Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Fire Accident

Fire Accident

Fire Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లోనూ అగ్నిప్రమాదం జరిగింది. అత్తాపూర్‌లోని పత్తి ప్యాకింగ్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. పత్తిని మంటలు అంటుకుని మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందిని సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్థినష్టం జరిగినట్లు వెల్లడించారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చలరేగాయని అనుమానం వ్యక్తం చేన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read also: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!

ఇక మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి చార్మినార్ సమీపంలోని యునాని ఆస్పత్రిలో ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read also: Telangana: దంచికొడుతున్న ఎండలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

తాజాగా మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పహల్ ఫుడ్ బిస్కెట్స్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తీసుకున్నారు. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. దీంతో కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
Kesineni Nani: ఫ్లైట్స్లో తిరిగే సుజనా చౌదరికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయి..