దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి జిల్లా కేంద్రం తప్ప మిగతా అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులు అను సంధానం అయ్యాయని, మోడీ ప్రధాని అయ్యాక తెలంగాణలో 75 రోడ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
31 వేల 664 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, 13 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్ పాటు మంజూరు అయిన పనులు 32 వేల 775 కోట్లని, సీఆర్‌ఐఎఫ్ కింద 3,314 కోట్లు మంజూరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. 850 కోట్లతో రోడ్ల మరమ్మతులు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కాకుండా జాతీయ రహదారులకు కేంద్రం 93 వేల 650 కోట్లు తెలంగాణకి కేటాయించిందని ఆయన పేర్కొన్నారు.
