Telangana: పెళ్లిళ్లే.. పెళ్లిళ్లు.. ఒక్కటి కానున్న 90వేల జంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు కూడా బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చే నెల 25 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో అందరూ తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 35 వేల పెళ్లిళ్ల వరకు జరగనున్నట్లు పురోహితులు, ఫంక్షన్ హాళ్ల ప్రతినిధులు వివరిస్తున్నారు.
మరోవైపు ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇప్పటి నుంచే వాటిని బుక్ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. నగరంలోని కొన్ని ఫంక్షన్ హాళ్ల ప్రతినిధులు ఉదయం పెళ్లి, సాయంత్రం రిసెప్షన్‌కు బుకింగ్ తీసుకుంటున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లకు ఏప్రిల్‌కు సంబంధించిన బుకింగ్‌లు మార్చి రెండో వారంలోనే పూర్తయ్యాయి. అంతేకాకుండా నగరంలోని పలు హోటళల్లో గదులు కూడా బుకింగ్ అయిపోతున్నాయి. సొంతూళ్ల నుంచి వచ్చే బంధువులకు ఇళ్లలో ఆతిథ్యం ఇవ్వడం కష్టంగా మారిన ఈ రోజుల్లో హోటల్ గదులు అయితే సౌలభ్యంగా ఉంటాయని ముందస్తుగా వాటిని కూడా బుక్ చేసేస్తున్నారు.
Also Read
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇప్పటికే శుభలేఖలు అచ్చువేసే ప్రింటింగ్ ప్రెస్‌లు, వస్త్ర దుకాణాలు సందడిగా కనిపిస్తున్నాయి. అటు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, మేకప్, బంగారు వ్యాపారులు, ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించేవారు, క్యాటరింగ్ సహా దాదాపు 20 రంగాలకు చెందినవారు చేతినిండా పనితో బిజీ అయిపోయారు.
https://ntvtelugu.com/live-shubhakruth-nama-ugadi-parayanam/
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..