కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు కూడా బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చే నెల 25 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో అందరూ తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు…