Site icon NTV Telugu

టీఎస్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

High Court TS

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమంగా జడ్జీల నియామకంపై ఫోకస్‌ పెట్టారు.. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.. తాజాగా. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించారు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిని తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జుడిషియల్‌ ఆఫీసర్లయిన శ్రీసుధా, సి. సుమలత, జి. రాధా రాణి, ఎం. లక్ష్మణ్‌, ఎన్‌. తుకారాంజీ, ఎ. వెంకటేశ్వర రెడ్డి, పి. మాధవి దేవీని.. తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమించింది ప్రభుత్వం.

Exit mobile version