Cyber Criminals: ఉద్యోగాల పేరుతో మోసం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో కాజేసిన సంస్థ.. ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం. ఎన్ని వార్తలు వస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎంత చెప్పిన ప్రజలు లైట్ తీసుకుంటుంటారు. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వారివద్ద నుంచి లక్షల్లో కాజేస్తుంటారు కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జాబ్ వస్తుందన్న ఆశతో వారు అడిగినంత డబ్బులు ఇచ్చి మోసపోయి చివరకు పోలీసులను ఆశ్రయిస్తుంటారు బాధితులు. ఇలాంటి వారిచేతిలో పడితే జాబ్ రావడం ఏమో గానీ వున్నదంతా ఊష్ కానీ అయిపోతుందని అర్థమయ్యేసరికి లేట్ అయిపోయి ఖాతా అంతా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి 46 లక్షలు పొగుట్టుకుంది. ఆన్ లైన్ జాబ్ అంటూ మే 15న అమీన్ పూర్ లో ఉండే మహిళకి మెసేజ్ రావడంతో.. ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని ఆశపడింది. దీంతో వారు ఎలా చెబితే అలా మొదట 2 వేలు డిపాజిట్ చేయగా ఆయువతిని నమ్మించడానికి సైబర్ నేరగాళ్లు 3 వేలు పంపారు. దీంతో బాధిత మహిళ నిజమేనని నమ్మి పలు దాఫాలుగా 46 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. కమిషన్ ఇవ్వాలని అడగడంతో అవతలి వ్యక్తులు స్పందించలేదు. దీంతో మోసపోయానని నమ్మిన మహిళ చివరకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Chiru: భోళా శంకర్… వాల్తేరు వీరయ్యని మించి ఉంటాడు
ఇటీవల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఇలాంటి మెసేజ్ లు, మెయిల్స్ ను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. శిక్షణ ఇప్పిస్తామంటూ ఏ సంస్థ డబ్బులు తీసుకోదని, పేమెంట్ అడిగితే మోసంగా గుర్తించాల్సి ఉంటుందని అంటున్నారు. జాబ్ ఆఫర్ గురించి మెసేజ్, కాల్, మెయిల్ వచ్చినప్పుడు ముందుగా ఆ కంపెనీ పోర్టల్స్‌ని చూసి వారి చిరునామా, ఫోన్ నంబర్లు సేకరించి కాల్ చేసి తెలుసుకోవాలని.. అన్నీ సరిగ్గా ఉంటేనే కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురవుతున్న వారిలో 70 శాతానికి పైగా మహిళలేనని అధికారులు చెబుతున్నారు. మోసపోయిన తర్వాత డబ్బులు రావడం చాలా కష్టమని, అందుకే ముందు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత బాధితులపై ఉందన్నారు. మనకు తెలియకుండా ఇలాంటి వాటిలో మోసపోతే వీలైనంత త్వరగా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. అసలు సంస్ధలు మన దగ్గర ఏ విధంగా డబ్బులు వసూలు చేయవు అంటే ముందుగా అందరూ నమ్మాలి అని అంటున్నారు. అలాగే జాబ్ ఆఫర్ అంటూ వచ్చే మెయిల్స్ లోని లింక్ లను తొందరపడి క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు అంటున్నారు. మన కంప్యూటర్ లోకి వైరస్ చొరబడే ప్రమాదం ఉందని అంటున్నారు.
Tilak Varma Sixes: తొలి 3 బంతుల్లో 2 సిక్స్‌లు.. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రమే అదుర్స్!