Site icon NTV Telugu

36th National Games: 36వ జాతీయక్రీడలకు తెలంగాణ క్రీడాకారుల జాబితా ఇదే!

Ts Sports

Ts Sports

ఈనెల 29 నుంచి గుజ‌రాత్‌ లో జ‌రగానున్న 36వ జాతీయ క్రీడ‌ల్లో పాల్గొనే తెలంగాణ క్రీడాకారుల జాబితా విడుద‌లయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడాకారుల‌కు అందిస్తున్న ‌స‌హాయ‌స‌హ‌కారాలపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మ‌న్ కార్యాల‌యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి, వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ రాజ్, జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్, ట్రెజరర్ మహేష్ పాల్గొన్నారు. తెలంగాణలో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం వివరించారు.

36వ జాతీయ క్రీడల కోసం తెలంగాణ నుంచి 26 క్రీడలకు సంబంధించి గుజరాత్ వెళ్లనున్న 302 మంది క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్ల బృందం వెళ్లనుంది. జాతీయ క్రీడల్లో పాల్గొననున్న 104 మంది మెన్, 126 మంది విమెన్ క్రీడాకారులు పాల్గొంటారని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గుజరాత్ లో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ టాప్ లో నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందన్నారు.

Read Also: Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామీణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది.రానున్న రోజుల్లో గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాం. ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. కామన్ వెల్త్ క్రీడా పథకాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. క్రీడల కోసం 100 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. దేశంలోనే గొప్ప క్రీడాపాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోంది.. ఇప్పటికే అనేక సార్లు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తో కూడిన సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో క్రీడా మైదానాలను పెంచుతున్నాం.

తెలంగాణ నుంచి జాతీయ క్రీడల కోసం 302 మందితో కూడిన బృందం గుజరాత్ వెళ్లనుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడాకారులు గొప్పగా రాణిస్తున్నారు. గుజరాత్ లో తెలంగాణ హవా చూపేందుకు క్రీడాకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Read ALso: Avatar : రీ-రిలీజ్ లో ‘అవతార్’ అంత వసూలు చేస్తుందా!?

Exit mobile version