Site icon NTV Telugu

Telangana Jobs: గుడ్‌ న్యూస్‌.. 9 మెడికల్‌ కాలేజీల్లో మరో 313 పోస్టులు

Telangana Jobs

Telangana Jobs

Telangana Jobs: తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు గాను మరో 313 పోస్టులు మంజూరయ్యాయి. క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించబడింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికే 3,897 పోస్టులు మంజూరైన సంగతి తెలిసిందే.

Read also: Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వ పాలసీని అధికార పార్టీ నేతలు అర్థం చేసుకోవాలి

ఒక్కో వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రికి వివిధ కేటగిరీల్లో మొత్తం 433 పోస్టులను సృష్టించింది. ఇటీవల సీఎం కేసీఆర్ కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తదుపరి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులు మంజూరయ్యాయి.
MLA Jaggareddy: నేను స్పీచ్ రాసుకుని వచ్చా.. ఆయన మాట్లాడితే మర్చిపోయా

Exit mobile version