రోజు రోజుకు తెలంగాణలో నాన్‌వెజ్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. కరోనా ప్రభావంతో మాంసం తినేవారి సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య రీత్యా ఎక్కువగా మాంసాన్ని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానికి ఈ సర్వే నిదర్శనం. అయితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణలో కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది కోడిమాంసం, చేపలు, మాంసం మినహాయించి గుడ్లు తింటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 2019-2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 7,24,115 మంది మహిళలు, 93,144 మంది పురుషులలో సర్వే నిర్వహించారు. అయితే.. ఈ సర్వేలో మాంసాహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని గుర్తించారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు పంజాబ్ నాలుగు రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో మెజారిటీ మాంసాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. జనాభాలో 51 శాతం మాంసాహారం తింటున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.