Uranium Smuggling India: తప్పిన ప్రమాదం.. యురేనియం ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదకరమైన యురేనియంను భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఇండో- నేపాల్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనుంచి 2కేజీల యురేనియంతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. మొత్తం 15 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
భారత్ లోకి 2 కిలోల యురేనియంను ఇండో-నేపాల్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే వారివద్దకు యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు. అయితే.. నేపాల్ కాఠ్మాండూ మీదుగా భారత్ లోకి బిహార్‌కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రమాదకర యురేనియంను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. సరిహద్దులోని బిరాట్‌నగర్ వద్ద తనిఖీలు నిర్వహించగా.. నిందితులు పట్టుబడ్డారు. వారివద్దనుంచి యురేనియంతో పాటు మరికొన్ని అనుమానస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బీహార్‌లోని అరారియా, జోగ్బానీ నుంచి స్మగ్లింగ్ కు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్మగ్లర్ల అరెస్టు అనంతరం భారత భద్రత సంస్థలు, సశస్త్ర సీమా బల్ అప్రమత్తమయ్యాయి. ఈనేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత పెంచాయి. పట్టుబడ్డ యురేనియం విలువ రూ. కోట్లలో ఉంటుందని, దీనిని అణ్వాయుధ తయారీలోనూ ఉపయోగిస్తారని వెల్లడించారు. అయితే.. ఒక కేజీ యురేనియం 24 మెగావాట్ల శక్తికి సమానమని, దీంతో విధ్వంసమే సృష్టించే అవకాశముందని, భద్రతా దళాల అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
Also Read
Minister Gudivada Amarnath: చంద్రబాబులా పబ్లిసిటీ కాదు.. ప్రజలకు సాయం చేయాలన్నదే మా ఆలోచన..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?