Heart attack in baby: వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా గుండెపోటు రావచ్చు. పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు అనే తేడా లేదు. ఇటీవలి కాలంలో ముప్పై ఏళ్లు నిండక ముందే నేడు యువత గుండెపోటుకు బలవుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. సడన్ గా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడం వల్ల చాలామంది మృత్యువాతపడుతున్నారు. గుండెపోటుతో యువకులు, చిన్నారులు మరణిస్తున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. అయితే కొందరు హీరోలు చాకచక్యంగా వ్యవహరించి గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయించి బతికిన సంఘటనలు కూడా చూశాం. సీపీఆర్.. ప్రస్తుతం గుండెపోటుతో పడిపోయిన వారికి లైఫ్ సపోర్టు. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఈ ప్రాణాలతో బయటపడింది. నెల కూడా నిండని పసికందు శ్వాస ఆగిపోతే సీపీఆర్ చేసి బతుకుతున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత సిద్దిపేట్ జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేస్తున్నారు. ఇటీవలే వీరికి పాప పుట్టింది. పాప వయసు 23 రోజులు. ఆమెకు సుబ్బలక్ష్మి అని పేరు కూడా పెట్టారు. అయితే పాపకు స్నానం చేయిస్తున్న సమయంలో వేడినీరు మింగడంతో ఊపిరి ఆగిపోయింది. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ సుగుణ వెంటనే 108 ఏఎన్‌ఎం తిరుమల సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ వెంటనే స్పందించి సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప గుండె, పల్స్ కొట్టకపోవడాన్ని సిబ్బంది గమనించారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు 108 సిబ్బంది సీపీఆర్ నిర్వహించి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిని మంత్రి హరీశ్ రావు వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్ చేశారు.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj
— Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023
గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడం వల్ల చాలామంది మృత్యువాతపడుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సర్కార్ మొదలుపెట్టింది. సడన్ గా గుండెపోటుకు గురైన వారికి చికిత్స అందజేసేందుకు ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సుమారు 1400 పరికరాలకును పబ్లిక్ ప్లేస్‌లలో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Bank FD Rate Increased: గుడ్ న్యూస్.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులు